Vaisakha Pournami Sabha | Day 13 | 05th May 2023 | వైశాఖ పౌర్ణమి సభ (05 మే 2023)
Vaisakha Pournami Sabha | Day 13 | 05th May 2023 | వైశాఖ పౌర్ణమి సభ (05 మే 2023)
ప్రెస్ నోట్ — పిఠాపురం — 5-5-23 వైశాఖ పౌర్ణమి సభ
మానవ కళ్యాణానికి దారితీసేదే త్రయీ సాధన అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహభాషణ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణం లో పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి వారి అధ్యక్షతన వైశాఖ పౌర్ణమి సభ నిర్వహించబడింది. ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ఎక్కడ చూసినా ద్వేషం, పగ, అశాంతి, అసహనం, అసంతృప్తి, మానవ మారణ హోమం ద్వారా మానవ వినాశనం వైపు దారి తీస్తున్న దృష్టాంతాలు కనబడు చున్నవి. ఏ మతం అయితే మానవత్వపు విలువలు గురించి చెప్పదో అది మతమే కాదని అన్నారు. భగవంతుడు ప్రసాదించిన ప్రకృతిని కూడా మానవుడు నష్ట పర్చు చున్నాడు. ఇటువంటి ప్రస్తుత పరిస్థితులలో ప్రతీ మానవుడు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా నైతిక విలువలు, మానవత్వపు విలువలు పెంపొందించు కావాలని డా. ఉమర్ ఆలీషా పిలుపు నిచ్చారు. మానవత్వపు విలువలు అచరించినప్పుడే తనలో ఉన్న జీవాత్మే పరమాత్మ అని అనుభవంలో గ్రహించ గల్గును. ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిని ప్రసాదించేది త్రయీ సాధన అని డా ఉమర్ ఆలీషా అన్నారు. జ్యోతి ప్రజ్వలతో సభ ప్రారంభించ బడినది. అంతర్జాతీయ తాత్విక బాల వికాస్ చిన్నారులు కాకర్లపూడి ఉమా తపస్వి,Ch రిషిత, మాన్విత్ రెడ్డి,Ch జస్వంత్ మరియు భారతీయ తాత్విక బాల వికాస్ చిన్నారులు అభినవ్ చంద్రక్, గుంపా సూర్య లోహిత్, తోట మోహిత్, జూహిశ్రీ ప్రసంగాలు సభికులను అలరింప చేసినవి. యువతీ యువకులు శ్రీమతి రంది జ్యోతి, శ్రీ యర్రంశెట్టి ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ తపస్సు అనగా త్యాగము, సాధన అని అన్నారు. సంగీత విభావరి కార్యక్రమాన్ని శ్రీమతి అనిశెట్టి ఉమా మహేశ్వరి నిర్వహించారు. పీఠాధిపతి డా. ఉమర్ స్వామి వారు 72 మందికి నూతనం గా మహా మంత్రోపదేశం చేశారు. విశాఖపట్నం శ్రీ మేడపాటి అయ్యప్పరెడ్డి శ్రీమతి భువన దంపతుల సహకారంతో ధ్యాన మందిరం వద్ద గల గులాబీ తోటలో దుక్కు దున్ని, కలుపు తీసే యంత్రాన్ని , యర్రంపలెం గ్రామానికి చెందిన శ్రీ ముత్యాల దుర్గా రావు శ్రీమతి వరలక్ష్మి దంపతుల సహకారం తో ఏర్పాటు చేసిన వాటర్ టేంకర్ ను, vvs విద్యా సంస్థల అధినేత శ్రీ అనిశెట్టి కృష్ణారెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ను స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా వారి సాహిత్యాన్ని పద్య పరిమళం యూ ట్యూబ్ చానెల్ లో ప్రతీ వారం ప్రసారం చేయడానికి, ముందుగా ఈశ్వరుడు అనే కావ్య ఖండిక తో స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. స్వామి UARDT web channel http://youtube.com/@uardt ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో శ్రీ AVV సత్యనారాయణ శ్రీ NTV ప్రసాద వర్మ, కుమారి చింతపల్లి అమృతవల్లి పాల్గొన్నారు. పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు సభను నిర్వహించారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921799.
News Paper clippings