Kavisekhara Dr.Umar Alisha 138th Birthday Celebrations at Boat Club, Kakinada
ప్రెస్ నోట్
స్వాతంత్ర్య సమర యోధునిగా, మహా కవిగా, సంఘ సంస్కర్త గా, వేదాంత వేత్త గా, సామాజిక ఉద్యమ కారునిగా, మౌల్వీ డా. ఉమర్ ఆలీషా గారు కీర్తి ప్రతిష్టలు సంపాదించారని సభాద్యక్షులు అహ్మద్ ఆలీషా అన్నారు. మంగళ వారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా మహా కవి విగ్రహం వద్ద, వారి 138 వ జయంతి ఉత్సవం కార్యక్రమానికి, ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి సోదరుడు అహ్మద్ ఆలీషా అధ్యక్షత వహించగా, మరొక సోదరుడు హుస్సేన్ షా, అహ్మద్ ఫజల్, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ, వేదిక నలంకరించి ప్రసంగించారు. అహ్మద్ ఆలీషా గారు మాట్లాడుతూ, 100 సంవత్సరాల క్రితం అజ్ఞానం, మూఢ నమ్మకాలు, మతమౌఢ్యం, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి భయంకరమైన సాంఘిక రుగ్మతలతో, కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డా. ఉమర్ ఆలీషా అని అన్నారు. ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పెండెంట్ శ్రీ హుస్సేన్ షా మాట్లాడుతూ బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యా సుల్కం, వరకట్నం దురాచారాలను నిర్మూలించడానికి ఎన్నో నవలలు, నాటకాలు రచించారని అన్నారు. శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ స్త్రీ విద్య లేని దేశానికి క్షేమం రానే రాదని స్త్రీ జన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన మహానుభావుడు డా. ఉమర్ ఆలీషా అని అన్నారు. సభా నిర్వాహకుడు శ్రీ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం నాటి అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వెలివేతల మీద ఎన్నో గ్రంధాలు రచించారని, పద్మావతి అనే నవల ను ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు తెలుగు నాన్ డిటేలుగా 45 సంవత్సరాల క్రితమే డిగ్రీ కళాశాలలో పాఠ్య పుస్తకాలుగా ప్రకటించారని అన్నారు. కుమారి అమృత వల్లి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా కేంద్ర శాసన సభ్యులు గా శాసన సభలో ప్రజల సంక్షేమం కోరుతూ, అవసరాన్ని బట్టి, ప్రభుత్వాన్ని వారి వాదనా పటిమ తో విమర్శిస్తూ, ఆచరణాత్మక సూచనలతో, అనర్గళంగా ప్రసంగాలు చేసిన మహా మహుడు డా. ఉమర్ ఆలీషా అని అన్నారు. 138 వ జయంతి ని పురస్కరించుకుని అహ్మద్ ఆలీషా గారు కేకే కట్ చేసి, భక్తులకు పంచారు. విశిష్ట సేవలు చేసిన వాలంటీర్లకు అహ్మద్ ఆలీషా గారు, హుస్సేన్ షా గారు పక్షులకు ఆహారంగా వినియోగించమని ధాన్యపు కుచ్చులను అంద చేశారు. హారతి తో సభ ముగిసింది. ఈ సభకు పిఠాపురం రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు , పురుహూతికా లలిత కళా పరిషత్ నిర్వాహకులు శ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతూ జాతి, కుల, వర్గ, మతాలకు, స్త్రీ, పురుష, దనిక, పేద, వయో భేదాలకు అతీతంగా ఆదర్శ గురువుగా అంతేవాసుల ఆరాధ్య దైవంగా డా. ఉమర్ ఆలీషా గారు గౌరవ మర్యాదలు, బిరుదులు, సత్కారాలు పొందారని శ్లాఘించారు. అహ్మద్ ఆలీషా గారు శ్రీ ప్రసాద్ గార్ని శాలువాతో సత్కరించి, మేమొంటో ను బహూకరించారు. హారతి తో సభ ముగిసింది.
ఇట్లు.
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921799.
Photos
News Paper
Media News