ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 51| 07th January 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 51
వక్తలు :
- శ్రీ గొసుల కరుణ ప్రసాద్, హైదరాబాద్
- శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, సింగరాజుపాలెం
108 వ పద్యము
ఏదియు వేరుగాదు పరికించిన నీవు జగత్స్వరూపమై
యాదియనాది మధ్య విలయంబగు దృశ్యము నున్నవాఁడ వీ
భేదము ప్రాయికంబగు వివేకము దాని పరిత్యజించి జ్ఞా
నోదయమన్న దెచ్చటగుచున్నదొ ఆ యణువీవు జూడఁగన్.
109 వ పద్యము
పంచభూతములు సృష్టించినప్పుడు నేమ
హాపదార్థము తేజమై యెసంగె
జీవజాలంబులు చెన్నారునపుడేది
చూట్కులలోఁ దొంగి చూడఁగలిగె
నీలమేఘములందు నెలలందు నేజ్యోతి
పరమాద్భుతంబుగా మెఱయఁగలిగె
మంచుబిందువులందు మణులందు నేవెల్గు
వివిధ విధంబుల వెలయఁగలిగె
అట్టి భాస్వత్ప్రపంచమే యానమునను
బోవువారికి దొరకునో బోధసేయఁ
గలుఁగునదె బ్రహ్మవిద్య నిక్కముగ దాని
ప్రజల కాణాచియని నేర్చి బడయవలయు.