ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 45| 26th November 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 45
వక్తలు :
- కుమారి నిడదవోలు హైమ, హైదరాబాద్
- రుద్రరాజు రమా ప్రశాంతి, కాలిఫోర్నియా
96 వ పద్యము
భూనభోంతరాళములకున్న సంకెళ్ళు
పట్టి యూఁపవచ్చు నెట్టవచ్చు
యింత చెప్పనేల యీ తపచ్ఛక్తికి
భూతచయమె బెదిరిపోవుచుండు.
97 వ పద్యము
జ్ఞానము సాధనలభ్యము
జ్ఞానము మాటలను లేదు కథఁ జెప్పుటకై
మానస మింద్రియవశమునఁ
బోని సమాధిని నెఱుంగఁబోలును తన్నున్.