ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 16| 07th May 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 16
వక్తలు :
శ్రీమతి తోట లక్ష్మీఉమామహేశ్వరి, ఏలూరు
కుమారి కొర్ర ఉష శ్రీ, కాకినాడ
33వ పద్యము.
వ్యాసములున్ విమర్శనలు భావకవిత్వరసై కచారువి
న్యాసములున్ మతాంతరమహాపరివర్తన తత్త్వరూపకో
పాసనముల్ పురాణములు వ్రాసితి భారతభూమి నే నుప
న్యాసములిచ్చుచున్ దిరిగినాఁడను “ఉమ్రలిషా” కవీంద్రుఁడన్
34వ పద్యము
వేలు రచించి విద్యలనుబెట్టి గడించితి పారితోషికా
ద్యాళిని వేయినూటపదియార్లును సింహతలాటముల్ మహా
భీలకనత్కళాకనక విశ్రుతముల్ జయభేరి మ్రోయ హిం
తాలవనీనటత్కుకవి తండములేమిటి లెక్క మాకడన్.