ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 10| 26th Mar 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 10

వక్తలు:
చిరంజీవి దేవినేని సిద్దు, అచ్చంపేట
చిరంజీవి అభినవ్ చంద్రక్, హైదరాబాద్

15వ పద్యము:
ఆతఁడు పీఠికాపురమహానగరిన్ దొలుదొల్త నానృప
వ్రాతముఁ గొల్వ పౌరులును పండితులున్ దనశిష్యులై యథా
రీతి మహత్మ్య మొక్కటి యెఱింగినఁ జూపుఁడటంచుఁ గోరఁగాఁ
జేతము తొంగలింప సరె చెప్పుడు చూపెదనన్న నావుడున్.

16వ పద్యము:
ఆదిమదిన్ కబీరను మహర్షి మహమ్మదు వారి వంశ
మర్యాద పిరానెపీరను మహాత్ముని బోధసుధాబ్ధివీచికల్
మేదిని వ్యాప్తి గాంచిన నమేయ మహాపరతత్త్వసాధనో
పాధికమైన యా తెఱవుఁ బట్టి కృతార్థతఁ గాంచె నెంతయున్.
అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ మొహియుద్దీన్ బాద్షా సద్గురువర్యులు

17వ పద్యము:
వారలు నింధనంబులను బండ్లకొలందిగఁ దెచ్చి కాల్చి యా
దారుణ వీతిహో త్రసముదాయమునన్ శయనింపుఁ డంచు వం
దారఁగ వారిఁజూచి ప్రమదంబున నవ్వి మదీన్ కబీరుఁ డా
తీరున నగ్నిఁజొచ్చెఁ దనతేజము దేవత లెల్ల మెచ్చఁగన్.

You may also like...