పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం |19 మార్చి 2022
పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం
19 మార్చి 2022
తణుకు శాసన సభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావుగారు ప్రసంగిస్తూ కరోనా నుండి కాపాడి ప్రజలందరినీ రక్షించే విధంగా ఆశీస్సులు ప్రసాదించమని పీఠాధిపతి డా.ఉమర్ అలీషా గార్ని కోరారు.
19 మార్చి 2022 శనివారం సాయంకాలం అత్తిలి స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా తణుకు శాసన సభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు శాసనసభ్యులు మొదటి అంతస్తు ప్రారంభోత్సవం చేసారు. అనంతరం గౌరవ శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గార్కి నూతన వస్త్రాలు బహూకరించి శాలువా కప్పి పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి సత్కరించారు. అనంతరం డా.ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ తల్లి తండ్రుల నుండి సేవా సంస్కృతి తాత్విక ప్రయాణం అలవర్చుకున్న శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు అభినందనీయులు అని అన్నారు.
ఆశ్రమ అభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు భవిష్యత్ లో కూడా ప్లోరింగ్ ఏ సి లు, సీలింగు నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన నాగేశ్వరరావు గార్కి ఆయురారోగ్యాలు అష్ట అశ్వర్యాలు ప్రసాదించాలని ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్ఫూర్తి తో మూడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కు కృషి చేసి కోవిడ్ వంటి వైరస్ ల బారిన పడకుండా మనకు మనమే కాపాడు కోవాలని పిలుపు నిచ్చారు. త్రయీ సాధన అనగా మంత్రసాదన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆశ్రమం లోనూ ఇంటి దగ్గర నిర్వహించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలని డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు.
శ్రీమతి పూర్ణ గారు కీర్తన ఆలపించారు.
శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు గారు పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వారికి పుష్ప గుచ్చం ఇవ్వగా శ్రీ యార్రం శెట్టి పుల్లారావు గారు, గౌరవ శాసన సభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గార్కి పుష్ప గుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. కొవిడ్ సమయంలో విశిష్ట సేవలు అందించిన ఎ.సి.యెన్ ఛానల్ మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రీ చంద్ర శేకర్ గార్ని డా. ఉమర్ ఆలీషా గారు శాలువా కప్పి మేమొంటో బహూకరించారు.
శ్రీ ఉమ్మిడి సూర్యనారాయణ గారు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వార్కి నూతన వస్త్రములు సమర్పించి ఆశ్శిస్సులు పొందారు.
కమిటీ సభ్యులు గజమాల తో గురుదేవులు డా. శ్రీ ఉమర్ ఆలీషా స్వామి వార్ని సత్కరించారు. జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల వెంకటరత్నం గారు, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరి బాబు గారు పాల్గొన్నారు.
కమిటీ సభ్యులు:
శ్రీ రెడ్డి వెంకటేశ్వరరావు గారు, శ్రీ బొండపల్లి నాగేశ్వరరావు గారు, శ్రీ బాయి శెట్టి సూర్యం గారు, శ్రీ యర్రంశెట్టి పుల్లారావుగారు, శ్రీ కె.వి.కె మారియ్య గారు, శ్రీ మైపాల గంగాధరరావు గారు, శ్రీ యిర్రి ప్రసాద్ గారు, శ్రీ రాచపోతు రమణ ప్రసాద్ గారు, శ్రీ బుద్దరాతితేజ గారు, శ్రీమతి ఉప్పులూరి కృపా కుమారి గారు, శ్రీమతి ఉమ్మిడి విజయలక్ష్మి గారు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు
పీఠం కన్వీనర్
98489 21799