సద్గురు డాక్టర్ ఉమర్ ఆలీషా గారికి సేవారత్న పురస్కారం – 15 నవంబర్ 2020
సద్గురు డాక్టర్ ఉమర్ ఆలీషా గారికి సేవారత్న పురస్కారం – 15 నవంబర్ 2020
ప్రపంచ అక్యు పంక్చర్ దినోత్సవ సందర్భంగా జరిగిన వేడుకలలో భాగంగా అశోక్ నగర్, విజయవాడ నందు గల ఇండియన్ ఓమ్ సంస్థ అధినేత అయిన శ్రీ మాకల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సభలో పలువురిని ఘనంగా సత్కరించారు.
ఆదివారం నవంబర్ 15 వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐ.పి.ఎస్ అధికారి ఏ.స్ ఖాన్, డా. అగతియార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులకు సేవారత్న అవార్డు ప్రధానం చేశారు. ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న సద్గురు డా. ఉమర్ ఆలీషా గారు ప్రాచీన వైద్య విధానమైన అక్యూ పంక్చర్ విధానాన్ని ప్రోత్సహించాలని పలువురు వక్తలు కోరారు. ఉగాది సందర్భంగా ఇండియన్ ఓమ్ మరియు నెహ్రు యువజన సంఘం కేంద్ర ప్రభుత్వ సంస్థ సంయుక్తంగా ఈ అవార్డులను ప్రకటించారు. కోవిడ్ వల్ల ప్రపంచ అక్యూ పంక్చర్ దినోత్సవ వేడుకలలో ఈ అవార్డులను అంద చేశారు.