13 జూన్ 2019 న “సస్యవృద్ధి బీజారోపణోత్సవం” కార్యక్రమము శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పిఠాపురం లో నిర్వహించబడినది
13 జూన్ 2019 న “సస్యవృద్ధి బీజారోపణోత్సవం” కార్యక్రమము శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పిఠాపురం లో నిర్వహించబడినది.
రైతులకు విత్తనాలు అందిస్తున్న పీఠాధిపతి ఉమర్ ఆలీషా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
పిఠాపురం, న్యూస్‌టుడే: రైతులకు మద్దతుగా నిలిచేందుకు అందరూ ఒకరోజు కేటాయించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం పట్టణంలోని గోర్సరేల్వేగేటు దగ్గరున్నా శ్రీవిశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో పీఠాధిపతి ఉమర్ ఆలీషా ఆధ్వర్యంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవం(విత్తనాలు భూమిలో వేయడం) కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా మంత్రించిన విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలలు పర్యటించానన్నారు. పంట పండిస్తున్న రైతులకు ఆ ఉత్పత్తిని ఎలా అమ్ముకోవాలో తెలియడం లేదన్నారు. వ్యవసాయ భూములు రియల్ఎస్టేట్ భూములుగా మారిపోతున్నాయన్నారు. యువత వ్యవసాయం చేసేందుకు ముందుకురావాలన్నారు. వైద్యుల దినోత్సవం, ఇంజినీర్ల దినోత్సవం మాదిరిగా రైతుల కోసం ప్రత్యేక రోజు కేటాయించాలన్నారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం ఉమర్ ఆలీషా మాట్లాడుతూ రైతులంతా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా మంత్రించిన విత్తనాలు రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ఇన్పుట్ సబ్సీడీ కారణంగా కౌలురైతులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత జోడిస్తే లాభాలు వస్తాయన్నారు. నకిలీ విత్తనాలతో ఎందరో రైతులు నష్టపోతున్నారని, ఈ ఏడాది అటువంటి సమస్యలు రాకూడదని కోరారు. రైతులంతా ఐక్యంగా ఉండి, అధిక దిగుబడులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
హాజరైన రైతులు
Courtesy : https://www.eenadu.net/archivespage/districtnewsdetails/133114/3/d/14-06-2019
Print Media