9-9-2023 Brahmarshi Hussain Shah sathguru 118th birthday celebrations
9-9-2023 Brahmarshi Hussain Shah sathguru 117th birthday celebrations
PRESS NOTE
Dt.09.09.2023,
PITHAPURAM.
ఆధ్యాత్మికత లోపించడం వల్లే సమా జంలో దుష్పరిణామాలు ఏర్పడు తున్నాయి – పీఠాధిపతి – డాక్టర్ ఉమర్ ఆలీషా, మానవుడిలో ఆధ్యాత్మికత లోపించడం వల్లే సమాజంలో దుష్పరిణామాలు ఏర్పడు తున్నాయని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా 118 వ జయంతిని పురస్కరించుకుని పిఠాపురం – కాకినాడ రోడ్ నందలి నూతన ఆశ్రమ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. ఆధ్యాత్మిక చింతనకు దూరంగా ఉంటూ కొంతమంది వ్యక్తులు క్షణికావే శంలో చేస్తున్న తప్పుల వల్ల ఎంతో విలు వైన కాలాన్ని, చేసిన తప్పుకు శిక్ష రూపంలో నష్టపోతున్నారని ఆవేదన చెందారు. మనసును అల్లకల్లోలం చేసేటువంటి కామ, క్రోధ,లోభ,మోహ, మద, మాశ్చర్యాలతో కూడిన అరిషడ్వ ర్గాలను స్థాయిపరచుకోవాలని పిలుపు నిచ్చారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మంచి,చెడులను విశ్లేషించుకునే శక్తిని ఇస్తుందని తెలిపారు. చిన్నతనం నుండీ ప్రతివ్యక్తీ తాత్విక జ్ఞానాన్ని అలవరచు కుంటే తన జీవితకాలమంతా ప్రశాంతంగా జీవనం కొనసాగించగలుగుతాడని అన్నారు . ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధన లతో కూడిన త్రయీ సాధనను అలవర చుకోవడం ద్వారా తాత్విక జ్ఞానం తెలి యబడుతుందని తెలిపారు. పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా రచించిన మహో త్కృష్ట గ్రంధం “షా తత్వాన్ని” ప్రతి ఒక్కరూ చదవాలని తెలిపారు. మతాలకు అతీతంగా మానవత్వాన్ని పరిడవింప చేసే అద్భుత గ్రంథం షా తత్వం అని పేర్కొన్నారు.
డాక్టర్ తోటకూర ప్రసాద్ కు హుస్సేన్ షా స్మారక పురస్కారం అందజేత
కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం కార్యదర్శి జాతీయ అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత తెలుగు భాష సంస్కృతి సాహితీ సంప్రదాయాల అంతర్జాతీయ కృషీ వలుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ కు అందజేశారు. పురస్కారంతో పాటుగా 50 వేల నూట పదహారు రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందించారు. ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా భీమవరంలో 33 సంవత్సరాలుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్న సమితి సభ్యులను పీఠాధిపతి ఈ సందర్బంగా అభినందించారు. అనంతరం పురస్కార గ్రహీత తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ తనకు ఈ పురస్కారం లభించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ప్రపంచలో ఉన్న ప్రతి తెలుగువాడి తరపున ఈ పురస్కారం అందుకున్నట్లుగా ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా ఆధ్యాత్మిక సాహిత్య సేవాకృషి చేస్తున్న విశిష్ట వ్యక్తి పీఠాధిపతి ఉమర్ ఆలీషా అని వెల్లడించారు. మానవాళికి మార్గదర్శనంగా నిలుస్తున్న పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు.
తదుపరి పద్య కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన మూకాంబిక శతకం గ్రంధాన్ని ఆలీషా సభలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జొన్నవిత్తుల సభలో మాట్లాడుతూ శాంతి, సత్య, ధర్మ, బోధనలను చందమామ భాషలో తేటతెల్లంగా చెబుతున్న మహనీయుడు పీఠాధిపతి ఉమర్ ఆలీషా అని అన్నారు జగత్తు హితాన్ని కోరే ఇటు వంటి తత్వవేత్తను దర్శించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.
అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పీఠాధిపతి ప్రారంభించారు. ట్రస్ట్ ద్వారా అనేకమంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను సభలో పంపిణీ చేసారు. పీఠం ముద్రించిన అనేక గ్రంథాలను ముఖ్య అతిథుల సమక్షంలో ఆలీషా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ పింగళి ఆనందకుమార్, ఎన్.టి.వి. ప్రసాద వర్మ, ఏవివి సత్యనారాయణ, సాహితీ విమర్శకుడు రోచిష్మాన్ శర్మ, ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె. పద్మరాజు, డాక్టర్ ఏలూరి శ్రీనివాస్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ చైర్ పర్సన్ వి. మాధవి, జేఎన్టీయూ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ సాహితీ సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ, ఉపాధ్యక్షుడు త్సవటపల్లి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ, వేగేశ్న సత్యవతి, వడ్డి విజయలక్ష్మి, త్సవటపల్లి సాయి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.