ది 23 జనవరి 2024 మంగళవారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 79వ వర్ధంతి సభ నిర్వహించబడినది
Press note. కాకినాడ 23-1-24
మతాతీతమైన విద్య, విజ్ఞానం ప్రబోధించిన మహనీయుడు కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి అని డా.GVR ప్రసాద రాజు గారు,JNTU VICE chancellor గారు అన్నారు. 23-1-24 ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి 79 వ వర్ధంతి సభకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలిషా గారి సోదరుడు అహ్మద్ ఆలీషా అధ్యక్షత వహించగా,JNTU VC డా.GVR ప్రసాద రాజు,AP సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీమతి జమ్మలమడక నాగమణి, శ్రీ భవర్ లాల్ జైన్, కవి శిరీష, హుస్సేన్ షా ముఖ్య అతిథులు గా వేదిక నలంకరించి ప్రసంగించారు. పక్షుల ఆహారం కొరకు కార్యకర్తలు శ్రీమతి మండా yellamamba, శ్రీమతి కాకినాడ లక్ష్మి గార్కి అలీషా గారు ధాన్యపు కుచ్చు ను అంద చేశారు. కాకినాడ శాఖ డైరెక్టర్లు 27 మందికి అలీషా గారు ప్రసాదాలు అందచేశారు. ప్రార్థన అనంతరం కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహానికి అతిథులు గజమాలలు వేసి సంస్మరించు కున్నారు.సభాద్యక్షులు శ్రీ అహ్మద్ ఆలీషా మాట్లాడుతూ కవి శేఖర డా. ఉమర్ ఆలీషా గారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు. మహా పండితుడు, బహు గ్రంథ కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర శాసన సభ్యుడు, గొప్ప మేధావిగా అభివర్ణించారు. ఉభయ గోదావరి జిల్లా ల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి జమ్మలమడక నాగమణి మాట్లాడుతూ స్త్రీలు , దళితులు, బలవంతులు, బలహీనులు అనే సమస్యల గురించి 100 సంవత్సరాల క్రితమే వారి నవలలు, నాటకాలలో, కావ్యాలలో రచించి, వారి సామాజిక స్పృహ ను చాటుకున్నారు. హుస్సేన్ షా మాట్లాడుతూఆనాటి సాంఘిక సమస్యలు అంటరానితనం, అస్పృశ్యత, అవిద్య గురించి వారి గ్రంథాలలో అనేక రచనలు చేశారుఅని అన్నారు. కవి శిరీష ఉమర్ ఆలీషా గారు రచించిన పద్యం దాని భావం సభకు వివరించారు. పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ 552 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, సామాజిక సేవలు, సాహిత్య సేవలు గురించి వివరించారు. సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ AVV satyanarayana, అచ్చంపేట సర్పంచ్ శ్రీ సలాది రమేష్ పీఠం సభ్యులు పాల్గొన్నారు. అతిథులను శ్రీ ఆలీషా గారు సన్మానించారు. అలిషా గార్ని హుస్సేన్ షా గార్ని పీఠం కమిటీ సత్కరించారు.
ఇట్లు
పేరూరరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921799.