26th Anniversary Spiritual Meeting at Tuni on 06 March 2023
మార్చి 6 తేదీ 2023 సోమవారం తుని లో 26వ వార్షిక ఆథ్యాత్మిక మహాసభ నిర్వహించబడినది
Press note Tuni 06-03-2023
అడవులను నరక వద్దు. అడవి జంతవులను చంప వద్దు అని డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు . శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, తుని దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మత సామరస్య సదస్సు కు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా, హిందూ మత ప్రతినిధి డా. శ్రీ శతావధాని శ్రీ తాతా సందీప్ శర్మ, ఇస్లాం మత ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ మత ప్రతినిధి డా.MS Wilayams, జైన్ మత ప్రతినిధి శ్రీ భవర్ లాల్ జైన్, బౌద్ధ మత ప్రతినిధి శ్రీ B. రత్నం, సిక్కుమత ప్రతినిధి శ్రీ గురు చరణ్ సింగ్ సాధు గారు వేదిక నలంకరించి వారి వారి మత ధర్మాల విశిష్టత ను సభకు వివరించి, పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా గారు మత సామరస్యత కు, దేశ సమగ్రతకు చేస్తున్న కృషి అభినందనీయం అని శ్లాఘించారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని కాపాడు కుంటేనే మానవ మనుగడ సుఖ శాంతులతో కొనసాగును అని అన్నారు. మతాలన్నీ మానవత్వ పరిమళాన్ని పరిమలింప చేయాలని అన్నారు. ఎంతటి ఉన్నత విద్యావంతుడు అయినా మానవత్వాన్ని చూపకపోతే అశాంతి,అభద్రత పెరుగును అన్నారు. మానవత్వం పరిడవిల్లాలంటే సత్యము, ధర్మము, అహింస, క్షమ, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం ఆచరించాలని అన్నారు. అన్ని మత ధర్మాల్లో ఆధ్యాత్మికత ఒక్కటే అని గ్రహించాలి. బిన్నత్వం నుండి ఏకత్వo వైపు నడిపించేదే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తత్వమని డా. ఉమర్ ఆలీషా అన్నారు. మత చాందస తత్వం వల్ల దుష్టత్వం, రాక్షసత్వం పెరిగి, మానవాళి కి తీవ్ర నష్టాన్ని కలుగ చేయును. మనస్సుకు స్వేచ్ఛ, స్వచ్ఛత, పవిత్రత ప్రసాదించేదే ఆధ్యాత్మికత అని అన్నారు. అదే నిజమైన ఈశ్వర రాజ్యమని, మనందరిలో ఉన్న దైవం ఒక్కరే అని ఏకత్వ భావనకు రావాలని డా ఉమర్ ఆలీషా అన్నారు. వివిధ మతాలు, వివిధ సంస్క్రుతులు, బిన్న భాషలు గల భారత దేశం ఆధ్యాత్మిక రాజదానిగ విరాజిల్లు తోందని అన్నారు. మానవత్వపు విలువలతో కూడిన ఆధ్యాత్మికత ద్వారా మాత్రమే విశ్వ శాంతి ఏర్పడునని డా ఉమర్ ఆలీషా అన్నారు.
హిందూ మతాదిపతి శతావధాని డా. తాతా సందీప్ శర్మ మాట్లాడుతూ క్రమ బద్దమైన జీవన విధానాన్ని తెలియ చేసేదే హిందూ ధర్మం అని అన్నారు.చతుర్వేద సారము అనగా ఏది ఆచరించాలి అని తెలియ చేసేదే హిందూ ధర్మం అని అన్నారు.ఇస్లాం మత ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ మాట్లాడుతూ దుష్ట దురాచారాన్ని ఖండించేదే ఇస్లాం ధర్మం అని అన్నారు.భారత దేశం లో వందలాది సూఫీ తత్వ వేత్తలు వారి జ్ఞాన బోధ ద్వారా అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞాన మనే వెలుగును ప్రసాదించారని, విశ్వ విజ్ఞాని డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని జగద్గురువు గా అభివర్ణించారు. ఎల్లప్పుడూ పారాయణ చేయబడే వేదమే ఖురాన్ అని అన్నారు. క్రైస్తవ మతాదిపతి డా.rev MS Williams మాట్లాడుతూ భారత దేశం యొక్క విశిష్టత, మత సామరస్యత, ఐక్యత అందరికీ ఆదర్శం అని అన్నారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలషా గారు సర్వ మతాలను సమ్మేళనం చేసి, జ్ఞాన ప్రబోధ చేస్తున్న మహా జ్ఞాని డా. ఉమర్ ఆలీషా అని అన్నారు. బైబిల్ 66 పుస్తకాల సంపుంటి బైబిల్ అని అన్నారు. దుర్నీతి, అవిశ్వాసం, పాపము ను నశింప చేయువాడే క్రీస్తు అని అన్నారు. ప్రేమకు, క్షమాపణ కు ప్రతి రూపమే క్రీస్తు అని అన్నారు.జైన మత ప్రతినిధి శ్రీ భవర్ లాల్ జైన్ మాట్లాడుతూ 24 వ తీర్డంకరుడు శ్రీ మహా వీరుడు 2000 సంవత్సరాల క్రితమే జ్ఞాన బోధ చేశారని అంత కన్నాపుర్వం 23 మంది తీర్డంకరుకరులు ప్రాచీనమైన జైన ధర్మాన్ని భోదించారని అన్నారు.క్షమ, సత్యం, అహింస ల సమ్మేళనమే బౌద్ధ ధర్మ మని అన్నారు.అందరు మఠాధిపతులను ఏకత్రాటి మీదకు తెచ్చి, మత సామరస్యత, దేశ సమగ్రత కు, విశ్వ శాంతికి కృషి చేస్తూన్న వారికి నా నమస్కారాలు అని అన్నారు. బౌద్ధ మత ప్రతినిధి శ్రీ B.రత్నం గారు మాట్లాడుతూ రోహిణీ నది జల వివాదం కొరకు రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరగ కూడదు అని శాంతి ని ఆకాంక్షించారు అని అన్నారు.పంచములతో చర్చలు జరిపాక, ఒప్పందం కుదరక పొతే అప్పుడు యుద్ధం చేద్దామని శాంతి కోరుకున్న మహానుభావుడు బుద్దుడు అని అభివర్ణించారు. గౌతమ బుద్దుడు శాంతి కాముకుడు.ధర్మానికి కేంద్ర బిందువే మానవుడు.దుఖాన్ని తొలగించు మార్గాన్ని ప్రభోదించేదే దమ్మము.Dr BR Ambedkar స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం ప్రకటించారని అన్నారు. సిక్కు మతాదిపతి శ్రీ గురు చరణ్ సింగ్ సాధు మాట్లాడుతూ పీఠాధిపతి ఉమర్ ఆలీషా గార్ని మహా గురువు గా అభివర్ణించారు. ఆయనే ఈశ్వరుడు, ఆయనే పరమేశ్వరుడు, సుఖ సంతోషాలు ప్రసాదించు వాడే ఉమర్ ఆలీషా అని అన్నారు.సర్వేశ్వరుని చేరుకోవాలంటే గురువు ఒక్కడే, ఆయనే విశ్వ గురువు డా.ఉమర్ ఆలీషా అని అన్నారు.నోబుల్ ITI ప్రిన్సిపాల్ శ్రీ GVV సత్యనారాయణ మఠాధిపతులను వేదిక పైకి ఆహ్వానించి, వార్షిక నివేదిక చదువగా , శ్రీ పేరూరి సూరిబాబు సభా నిర్వహణ చేయగా,శ్రీ G. అప్పల నాయుడు మాస్టారు వందన సమర్పణ చేశారు . ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీమతి కలిదిండి మంజుషా, శ్రీమతి కర్రీ దుర్గమ్మ లకు స్వామి కుట్టు మిషను లు పంపిణీ చేశారు.దీనికి సహకరించిన దాతలు శ్రీమతి కాకర్లపూడి ఉష, రాజమహేంద్రవరం మరియు శ్రీమతి శ్వేత, విశాఖపట్నం సహకరించారు.కుమారి అబ్బిరెడ్డి అనూష సహకారం తో 18 మంది ఆశ్రమ సేవకులకు స్వామి నూతన వస్త్రాలు బహూకరించారు. హరిత వికాస్ ఫౌండేషన్ శ్రీ పోలుపర్తి దాలి నాయుడు మాస్టారు స్వామి వారికి ప్రత్యేక ధాన్యపు కుచ్చును ఇవ్వగా, స్వామి 13 మంది ఆశ్రమ సేవకులకు పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను స్వామి బహూకరించారు. సస్య భీజారోపణ ఉత్సవం ద్వారా రైతులకు పంపిణీ చేసిన మంత్రించిన ధాన్యం నుండి పండించిన వరి కుచ్చులను స్వామి పక్షులకు ఆహారంగా పంపిణీ చేశారు. శ్రీ జంపన కేశవ రాజు, శ్రీ NTV ప్రసాద వర్మ, శ్రీ G. రమణ, శ్రీ ఆది నారాయణ, శ్రీ లెక్కల జగన్నాధం, తదితరులు తుని కమిటీ స్వామి వార్ని శాలువా కప్పి సత్కరించగా పీఠాధిపతి వివిధ మఠాధితులను సత్కరించారు.
ఇట్లు
శ్రీ GVV సత్యనారాయణ,
తుని.
9246694266
Invitation
Photos
News Paper