23rd Bheemili Ashram Anniversary – December 25th 2024
జ్ఞానము ద్వారా మానసిక దుర్గంధాన్ని తొలగించుకొండి
BACK TO BACK NEWS
https://www.b2bnewstelugu.in/2024/12/blog-post_39.html?m=1
B2B NEWS December 26, 2024
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhDlVyTgZKOcc2HbqoOkS8DHcmGe6LGESRk2MHTMPYbGaH05gnlKwcq91Rb70AHvN5MSRmV3ZIY47z8wFlXWu9NgudakX-OFMFBXEaNTOpsQoritiUxXQDB-i_spKwJeqrrWGGS9GWJeyphyF7-ufSi8g0itjGDQoiRutyqVX-k0mes6ddV_FGUPyENrzk/s320/IMG-20241226-WA0007.jpg)
జ్ఞానము ద్వారా మానసిక దుర్గoదాన్ని తొలగించుకొండి అని పీఠాధిపతి డాక్టర్… ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. డాక్టర్. ఉమర్ అలీషా స్వామి మాట్లాడుతూ తాత్విక జ్ఞాన శక్తి ద్వారా మానవునిలో సదాలోచన ప్రవేశ పెట్టి , మానవత్వం పరిమళింప చేయు వాడే సద్గురువు అన్నారు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjcxCGTeBFI9iOdTBVcgpD9PKTAL5sz2Z17UOUpyixYWlmE9kH5w4RlB1_2ZyLmozBptyN4fhtrgTwC_gP_v1dcn9PFnOpbdwuiPJA4ez665SCy3EazGc4xUDOl1gR_W7xeaTmEDPrxzO9rLVwkhNpHJmf2ULD86rD_3sQjPSzPi86Zw1-k5TyoxXy_0HA/s320/IMG-20241226-WA0008.jpg)
ఆధ్యాత్మికత మానవునిలో సేవా స్ఫూర్తిని కల్పించును. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విస్మరించరాదు అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం భీమిలి ఆశ్రమ ప్రాంగణంలో 23 వ వార్షికోత్సవ సభ కు పీఠాధిపతి డాక్టర్. ఉమర్ అలీషా స్వామి అధ్యక్షత వహించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడు డాక్టర్. వెంకటేశ్వర యోగి ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ వేత్త పరవస్తు ఫణి శయనసూరి , విశాఖ సమాచారం చైర్మన్ ఎస్. వీరభద్రరావు, మనోజ్ కుమార్ జాయిన్, ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgu-ODvzgiKUGtZx1x5V8YcW_9ZPeo0nxO0I_xzlK_Wxxt36YFH9HBoKoqnjcdKg0sPUe01sUYy42pSOdX3c9zw7Ilzs0INxEV7_gaZphofj4ibKB6zmiHH6Ug6lmmqlcZ73HROD7kJRJsKhZHSQNxlZz0FWzZtKoZ9LQd1nCQ06aGO3aUOtcz2zihaLkI/s320/IMG-20241226-WA0010.jpg)
డాక్టర్. వెంకటేశ్వర యోగి మాట్లాడుతూ మానవుడు లో జ్ఞాన పార్శ్వం, అజ్ఞాన పార్శ్వం రెండూ ఉంటాయి. సద్గురువు జ్ఞాన భోద ద్వారా మానవుని చెయ్యి పట్టుకుని అజ్ఞానము నశింప చేయునని అన్నారు. పరవస్తు సూరి పాడిన పద్యాలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్. పింగణి ఆనంద్ కుమార్, డాక్టర్. ఏ.రాధాకృష్ణ,,సభలో ప్రసంగించారు. ఎన్టీవీ ప్రసాద వర్మ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్యకర్తలు పివి. రామారెడ్డి, డి. రమేష్., బంగార్రాజు , డివి. నారాయణ రావు, డి. సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
December 25th 2024, భీమిలి సభకు ఆహ్వానం SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM
no images were found
Before Sabha News Clippings
no images were found
After Sabha News Clippings