2020 Vysaka Masa Paryatana Details
సభ్యులకు విజ్ఞప్తి
కరోనా వైరస్ వ్యాధి – కోవిడ్ 19 కారణంగా 24-04-2020 నుండి 06-05-2020 వరకు జరగవలసిన స్వామి యొక్క వైశాఖ మాస పర్యటనను ఆన్లైన్ / అంతర్జాలం లో సభ్యులు వారి ఇంటి వద్దనుండే భౌతిక దూరం పాటిస్తూ జరుపుకునే అవకాశమును కల్పించబడినది.
సభ్యులు తమ తమ గృహాల్లో భౌతిక దూరం పాటిస్తూ అంతర్జాలంలో పంపిన వీడియో ఆధారంగా సభ, ఆరాధన, హారతి స్వామి వచ్చినపుడు ఎలా నిర్వహించుకునేవారో అదే విధముగా నిర్వహించుకొనగలరు.
కావున ఈ వైశాఖ మాసం పుణ్యకాలంలో ప్రతీ రోజు స్వామి సందేశం వాట్స్ అప్ లో సభ్యులందరికీ పంపించబడుతుంది.
కావున సభ్యులందరూ ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు తమ తమ గృహాలలో ఆరాధన నిర్వహించుకుని స్వామి సందేశం విని, స్వామి ఆశీస్సులు పొందవలసిన గా విజ్ఞప్తి. సభ్యులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలసినదిగా కోరుచున్నాము.
స్వామి వైశాఖ మాస పర్యటన జరిగే ప్రాంతాల సభ్యులు ఆరోజు ఆరాధనా కార్యక్రమములో పాల్గొనెదరు.
07-05-2020 (గురువారం) నాడు వైశాఖ పౌర్ణమి సభ ఉదయం 10.00 గం నుండి 11.00 గం వరకు అంతర్జాలం లో జరుపబడును.
వైశాఖ పౌర్ణమి సభ ఆరాధన:
వైశాఖ పౌర్ణమి సభలో ఆరాధన అనగా హారతిలో పాల్గొన దలచిన వారు శ్రీ పేరూరి సూరిబాబు గారిని సంప్రదించవచ్చును.
ఇతర వివరములు కొరకు పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు 9848921799 గారిని సంప్రదించవచ్చును.
గమనిక: ఆరాధనా కార్యక్రమము లో పాల్గొనదలచిన వారు తమ పేర్లను ఒక రోజు ముందుగానే తెలియజేయవలెను. అప్పుడే ఆపేర్లు ఆన్లైన్ ఆరాధనలో చదివే అవకాశము ఉండును .
ముఖ్య గమనిక: లాక్ డౌన్ సమయములో గ్రామాలలో మరియు, పట్టణములో ని ఆశ్రమములు అన్ని మూసి ఉంచవలెను. ఆశ్రమమునకు ఎవ్వరు వెళ్ళరాదు. ఖచ్చితముగా మూసి వేయవలెను
ఇట్లు
పేరూరి సూరిబాబు
కన్వీనర్
98489 21799