19-Mar-2020 Thursday Sabha @ Pithapuram Cancelled

పిఠాపురం, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం లో తేదీ : 19-3-2020 నిర్వహించే గురువారం సభా కార్యక్రమమును , కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగముగా రద్దు చేయడమైనదని పీఠం మెడికల్ కోఆర్డినేటర్ డా ఆనంద కుమార్ పింగళి పత్రిక ప్రకటన లో తెలిపారు.

స్వామి దర్సనము కూడా ఉండదు.

ఈ సందర్భముగా అయన మాట్లాడుటూ ” ప్రజలు అందరూ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించుటకు , జనసమూహములో తిరుగకుండా , కనీసము 10 రోజులు ఇంటి వద్దనే ఉండి , వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని , తద్వారా సామాజిక అభివృద్ధికి , దేశ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రజలలో కరోనా వైరస్ పట్ల అవగాహనా కల్పిస్తూ , ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు 8 లక్షల మందికి పైగా వ్యాధినిరోధక హోమియో మందులు పంపిణి చేశారని అన్నారు. దగ్గు , జలుబు , జ్వరము ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా డాక్టరుని సంప్రదించాలని అన్నారు. ”

ఇట్లు

డా ఆనంద కుమార్ పింగళి
మెడికల్ కోఆర్డినేటర్ , శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం
మరియు కన్వీనర్ – ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ , పిఠాపురం
Cell : 9866388979

You may also like...