మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలో సభ నిర్వహించడబడినది | 18 ఫిబ్రవరి 2023
18 ఫిబ్రవరి 2023 వ తేదీన పరమ పవిత్రమైన పరమేశ్వరుని కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన రాజమహేంద్రవరంలో సభ నిర్వహించడబడినది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల దివ్య సందేశం సభ్యులకు దర్శన భాగ్యం కలిగించడం జరిగింది.
Press note
గరళ కంటుడు గరళాన్ని తన కంఠం లో దాచుకుని అమృతాన్ని దేవతలకు పంచినట్లే, సద్గురువు జ్ఞానామృతాన్ని సభ్యులకు పంచి, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రసాదించును అని డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు.18-02-2023 శనివారం మధ్యాహ్నం మహా శివరాత్రి పుణ్య కాలంలో రాజమహేంద్ర వరం గౌతమి ఘాట్ లో ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సదస్సు నుద్దేశించి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. ఓంకార స్వరూపుడైన మానవుని ఈశ్వరుని గా మార్చు జ్ఞానామృతాన్ని ప్రభోదించి, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణా శక్తిని ప్రసాదించుట జరుగునని డా. ఉమర్ ఆలీషా అన్నారు. మంత్ర సాధన , జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా మానవుడు తనలో ఉన్న ఈశ్వరుని గ్రహించ గలడని, అహం బ్రహ్మాస్మి గా పరిణామం చెంద గలడని డా. ఆలీషా అన్నారు. స్థానిక కన్వీనర్ శ్రీ D. కృష్ణం రాజు సద్గురువు ఇచ్చే ప్రసాదం ఎట్లా ఉన్నా స్వీకరించ గల్గిన వాడికి అనుభవ రూపంలో ఆశీస్సులు పొందగల్గునని కథను సభకు వివరించెను. వందలాది సభ్యులు శివ స్వరూపి డా. ఉమర్ ఆలీషా స్వామి వార్ని దర్శించుకుని పునీతులైనారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, స్థానిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హారతి తో సభ ముగిసింది.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921799.