135th Birthday Celebrations of Kavisekhara Dr. Umar Alisha (6th Peethadhipathi) conducted at Tadepalligudem on 28 Feb 2020
ది.28 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునందు షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 135 వ జయంత్యోత్సవ సభ నిర్వహించబడినది.
ఈ జయంతి సభను జరుపుటకు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీ దంగేటి రామకృష్ణ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం గత రెండు సంవత్సరములుగా నిర్వహిస్తున్నారు. ఈ సభకు డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేష్ చంద్రజి గారు అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ ఈ సభ తాడేపల్లిగూడెంలో జరపడం ఆనందదాయకమన్నారు. మరో అతిధి ప్రముఖకవి గేయ రచయిత రాష్ట్ర సాహిత్య అకాడమీ సభ్యులు శ్రీ రసరాజు గారు ప్రసంగిస్తూ ఉమర్ ఆలీషా గారి కాలంలో స్వాతంత్ర్యం రాక మునుపే స్త్రీ జనోద్ధరణ కొరకు అనేక గ్రంథాలు వ్రాసారు. మరో ముఖ్య అతిధి పెనుగొండ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ డా౹౹ రంకిరెడ్డి రాంమోహనరావు గారు మాట్లాడుతూ కవి గారి సాహిత్యం ఎలా ఉంటుందంటే కవులకే కాకుండా వారియొక్క భక్తులకు కూడా నాలుకపై ఉండేలా వ్రాసి భక్తులకు పంచడం జరిగిందన్నారు. ఆశ్రమ స్థలదాత శ్రీ తంగెళ్ళ వీర భోగ వసంతరాయులు గారు మాట్లాడుతూ స్వామి ఆశీస్సులతో ఈ భవనం నిర్మించబడిందన్నారు.
ఈ కార్యక్రమంలో వక్తలుగా శ్రీ సాయివెంకన్నగారు, శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీ రాంప్రసాద్ గారు, శ్రీ సాయిబాబా గారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు, శ్రీ తంగెళ్ళ త్రిమూర్తులు గారు, శ్రీ తోట సత్యనారాయణ గారు, శ్రీ గంధంబాబు గారు, శ్రీ బి. శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.